DGP Rajendranath Reddy : పుంగనూరు హింసాత్మక ఘటనలపై విచారణకు ఆదేశించిన డీజీపీ
పుంగనూరు హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy) విచారణకు ఆదేశించారు. హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammi Reddy), చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిలను(SP Rishant Reddy) ఆదేశించారు. ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..

DGP Rajendranath Reddy
పుంగనూరు హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy) విచారణకు ఆదేశించారు. హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammi Reddy), చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిలను(SP Rishant Reddy) ఆదేశించారు. ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని అన్నారు. వాహనాలను కూడా తగలబెట్టారని చెప్పారు. వాహనాల ధ్వంసం చేసిన వారిని.. రాళ్లు రువ్విన వారిని గుర్తించామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. హింసాత్మక ఘటనల వెనుక ఎవరున్నారనే విషయంలో ప్రాథమిక సమాచారం ఉందని డీజీపీ పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి సారించామని డీజీపీ తెలిపారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మారిన విషయం కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇదిలావుంటే.. 30 మంది టీడీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
