తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam ) వైభవంగా, నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి(Malayappa Swami) భక్తులకు అభయమిచ్చారు.నారాయణుడి లీలలు నవరస భరితాలు..ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసమే.బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam ) వైభవంగా, నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి(Malayappa Swami) భక్తులకు అభయమిచ్చారు.నారాయణుడి లీలలు నవరస భరితాలు..ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసమే.బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే! నాలుగో రోజు ఉదయం స్వామి వారు తన కల్ప వృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చేది కూడా ఇందుకే.కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం.పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం ఉంది. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారమే.కోరినంత వరాలను గుప్పించే దేవుడే.ఈ రోజు సాయంత్రం స్వామివారు స్వరభూపాల వాహనంపై ఊరేగుతారు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల ప్రదర్శనలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడసేవ జరుగుతుంది. అలంకరణ కోసం చెన్నై నుంచి తిరుమలకు గొడుగుల ఊరేగింపు ఉంటుంది. ఇందులో భక్తులు ఎలాంటి కానుకలు అందించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. ఈ రోజు ఈ గొడుగులు తిరుమలకు చేరుకుంటాయి. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత ప్రధానమైనది కాబట్టి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఘాట్‌రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సెప్టెంబర్‌ 23 ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్రవాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ దగ్గర ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేసుకునే వీలు కల్పించింది. మరోవైపు బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌ల్లో 12 రాష్ట్రాల‌కు చెందిన క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశామ‌ని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి రాజగోపాలరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ కలిపి మొత్తం 12 రాష్ట్రాల కళారూపాల‌ను వాహనసేవల్లో ప్రదర్శిస్తున్నామన్నారు.గ‌రుడ సేవ‌ రోజు 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న‌ క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

Updated On 21 Sep 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story