కీసర మునేటి(Keesara Muneti) వద్ద ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని టీడీపీ(TDP) నేత‌ల బృందం ఈ రోజు సందర్శించింది. మునేటి వద్ద ఇసుకలో బైఠాయించిన టీడీపీ నేత‌ల బృందం జగన్‌(Jagan) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇసుక(Sand) అక్రమ దోపిడీ అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కీసర మునేటి(Keesara Muneti) వద్ద ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని టీడీపీ(TDP) నేత‌ల బృందం ఈ రోజు సందర్శించింది. మునేటి వద్ద ఇసుకలో బైఠాయించిన టీడీపీ నేత‌ల బృందం జగన్‌(Jagan) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇసుక(Sand) అక్రమ దోపిడీ అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మునేటికి వెళ్లిన‌వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇత‌ర టీడీపీ నేత‌లు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి సోద‌రుడు అనిల్ రెడ్డి(Anil Reddy) నేతృత్వంలో ఇసుక దోపిడి జ‌రుగుంద‌ని ఆరోపించారు. ఆయ‌నకు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ మోహ‌న్ రావు, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, అరుణ్ కుమార్(Arun Kumar) త‌దిత‌రులు స‌హ‌క‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మొత్తం దోపిడినే.! అసలు రాష్ట్రంలో టెండర్లు ఫైనల్ అవ్వలేదన్నారు. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి చెబుతున్నాడు ఎక్స్‌టెన్ష‌న్‌ చేశామని.. అయితే ఆ డాక్యుమెంట్లు బయట పెట్టండి? అని నిల‌దీశారు. జేపీ సంస్థకు రెండేళ్లు అగ్రిమెంట్ అయిపోయింది.. రెండేళ్ల నుంచి ఎవరు తోలకాలు జరుపుతున్నారని ప్ర‌శ్నించారు. తాను పత్రికలు, మీడియాతో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి అడిగాను.. అయినా సమాధానం లేదన్నారు. ఇసుక గుంతల కారణంగా ఎంతోమంది చనిపోయిన ఈ ప్రాంతంలో బ్రిక్స్ ఫ్యాక్టరీలు పెట్టి జేసీబీలు, ప్రోక్లైన్లతో పందికొక్కుల్లా దోచుకుంటున్నారని మండిప‌డ్డారు. వందల కోట్లు సంపాదించారు చాలా లేదా.? మృతుల కుటుంబ సభ్యుల క్షోభ బాధ పట్టడం లేదా అని అడిగారు.

ఇసుక దోపిడీతో తాడేపల్లి కొంపకు 40,000 కోట్లు వెళ్లాయి ఇది జగమెరిగిన సత్యం అని అన్నారు. ఈ ఇసుక దోపిడీలో ఎవరైతే భాగస్వాములయ్యారో నాశనం అయిపోతారని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు న‌ష్టప‌రిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చులు 10 లక్షలు తగ్గకుండా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.

Updated On 14 Nov 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story