Ex Minister Devineni Uma : కేసీఆర్కు జగన్ కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు
ఎన్నికల్లో కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకొని జగన్ రెడ్డి కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. 1500 వందల కోట్లు తెచ్చుకొని అఫెక్స్ కౌన్సిల్ లో జగన్ రెడ్డి నోరు తెరవలేదన్నారు.
ఎన్నికల్లో కేసీఆర్(KCR) దగ్గర డబ్బులు తెచ్చుకొని జగన్ రెడ్డి(Jagan) కృష్ణా జలాల(Krishna Water)ను తాకట్టు పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా(Devineni Uma) సంచలన ఆరోపణలు చేశారు. 1500 వందల కోట్లు తెచ్చుకొని అఫెక్స్ కౌన్సిల్ లో జగన్ రెడ్డి నోరు తెరవలేదన్నారు. ఢిల్లీ(Delhi) వెళ్లిన జగన్ రెడ్డి కృష్ణా జలాలు గురించి ప్రధాని(PM Modi), అమిత్ షా(Amit Shah) లతో ఎం మాట్లాడాడో రైతంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) నుండి నీరు మన ప్రాంతానికి రాదు. జగన్ నిర్ణయంతో రాయలసీమ(Rayalaseeema), కృష్ణా(Krishna), గుంటూరు(Guntur) జిల్లాలు ఎడారిగా మారనున్నాయని అన్నారు.
కృష్ణా జలాలు రాకపోతే రాయలసీమలో కరవు వచ్చే పరిస్థితి ఉందని హెచ్చరించారు. రైతుల హక్కులను కాపాడే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కృష్ణా జలాలు పంపిణీపై పునఃసమీక్ష చేసుకుంటాం అని తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి, జగన్ రెడ్డిలు మూసుకు కూర్చున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు రాకపోతే కృష్ణా డెల్టా, సాగర్ కింద 35 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు.
బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి(Avinash Reddy) పేరు లేకుండా చేయడానికి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో లాలూచి పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హక్కులను గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) కర్ణాటక(Karnataka), తమిళనాడు(Tamilnadu) లకు తాకట్టు పెట్టారని.. చేతగాని వాడికి అధికారం ఇస్తే ప్రజల హక్కులను తాకట్టు పెడతారు అనే దానికి జగన్ రెడ్డి నిదర్శనం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.