తిరుమల(Tirumala) యాత్ర చేసే వారికి తిరుమల వేంకటేశ్వరుడు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) అనుబంధంగా ఎన్ని ఆలయాలున్నాయో తెలియదు. తిరుమల దేవస్థానానికి దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు వున్నట్టే వందలాది ఆలయాలూ వున్నాయి. అందులో తిరుపతిలోని కోదండరామాలయం ఒకటి.

తిరుమల(Tirumala) యాత్ర చేసే వారికి తిరుమల వేంకటేశ్వరుడు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) అనుబంధంగా ఎన్ని ఆలయాలున్నాయో తెలియదు. తిరుమల దేవస్థానానికి దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు వున్నట్టే వందలాది ఆలయాలూ వున్నాయి. అందులో తిరుపతిలోని కోదండరామాలయం ఒకటి. టీటీడీ ముద్రించిన స్థలపురాణాన్ని బట్టి సంతానం కోసం దశరథుడు తిరుమలలో విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారట! వేంకటేశ్వరుడు ప్రత్యక్షమై పుత్రకామేష్టి యాగం చేయమని దశరథుడిని ఆదేశించాడట! తిరుమలవాసుడి ఆదేశాల మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం, ఆయనకు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించడం జరిగాయట!
తిరుపతిలోని కోదండరామాలయాన్ని జాంబవంతుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. తిరుపతి నడిబొడ్డున ఉన్న చిన్న బజారు వీధిలో ఉందీ ఆలయం. శ్రీకృష్ణ దేవరాయల తర్వాత సాలువ నరసింహరాయలు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేసిన సమయంలోనే ఈ ఆలయ నిర్మాణం జరినట్టు తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన మహంతుల పాలనలో రాముల వారి ఆలయం మరింత అభివృద్ధి చెందింది. కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల కోసం తిరుమల నుంచి శ్రీవారి ఆభరణాలను ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలంకరణ చేస్తారు.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత సీతా దేవి. ధారణంగా రాముడికి ఎడమవైపున మాత్రమే సీత ఉంటుంది. అయితే తిరుపతిలోని కోదండరామాలయంలో రాముడికి కుడివైపున సీతాదేవి ఉంటుంది. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం. మరో విశేషమేమిటంటే ఈ ఆలయంలో నవమి రోజున కల్యాణం జరగదు. దశమి రోజున సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఇందుకోసం వాయువ్యమూల ధ్వజస్తంభానికి ఉత్తరభాగాన ఓ పెద్ద కల్యాణ మండపాన్ని నిర్మించారు. భద్రాచలంలో ఎంత గొప్పగా కల్యాణం జరుగుతుందో అదే రీతిలో ఇక్కడా జరుగుతుంది. ఆగమశాస్త్రానుసారంగా నిర్మించిన ఈ ఆలయం అచ్చంగా తిరుమల శ్రీవారి ఆలయంలాగే ఉంటుంది. గుడిలోని ప్రతిస్తంభంపైనా భాగవత, రామాయణ ఘట్టాలను, దేవతామూర్తుల శిల్పాలను చెక్కారు. ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.

Updated On 15 April 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story