Jyothula Nehru : అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూకు అవమానం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో(AP assembly sessions) ఇవాళ స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghu ramakrisham raju) కాసేపు కూర్చున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో(AP assembly sessions) ఇవాళ స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghu ramakrisham raju) కాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో తెలుగుదేశంపార్టీ(TDP) సభ్యుడు జ్యోతుల నెహ్రూ(Jyothula nehru) మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగాన్ని రఘురామకృష్ణరాజు అడ్డుకోవడంతో నెహ్రూ కాసింత మనస్తాపం చెందారు. తనను ప్రతిపక్షపార్టీ నాయకుడిగా చూడటం మానేయాలని చెబుతూ మాట్లాడకుండా కూర్చోమంటే కూర్చుంటాను అని అన్నారు. అసెంబ్లీకి రావద్దని చెబతే అదే పని చేస్తానంటూ జ్యోతుల నెహ్రూ చెప్పారు. కనీసం అయిదు నిమిషాలైనా మాట్లాడనివ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే రఘురామకృష్ణరాజు కలగచేసుకుని తాను మాట్లాడవద్దని అనలేదని, త్వరగా ముగించాలని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చుకున్నారు. దాంతో నెహ్రూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇసుక పాలసీ(Sand policy) ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నదని, పాత విధానమే బాగుంటుందని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని అనడంతో రఘురామకృష్ణరాజు బెల్ కొట్టారు. ప్రసంగాన్ని ఆపాల్సిందని కోరారు. సభ్యులు అసహనంతో ఉన్నారని, ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉందని తెలిపారు. తర్వత జ్యోతుల నెహ్రూ మైక్ కట్ చేసి కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు రఘురామ కృష్ణరాజు.