ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ను కోరుకోవడం తప్పు కాదు. కానీ మా నాయకుడు పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోట్లాది మంది జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారని జనసేన సీనియర్ నేత కిరణ్‌ రాయల్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story