Pawan Kalyan Wife At Tirumala : శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న శ్రీమతి అన్నా కొణిదెల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు

తిరుమల చేరుకొని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం
అనంతరం శ్రీ వరాహ స్వామివారి దర్శనం... పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పణ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు గారు ఆదివారం సాయంత్రం తిరుమల(Tirumala)కు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి శ్రీ పవన్ కల్యాణ్(Pawan Kalyan) గారి దంపతుల కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీమతి అన్నా కొణిదల గారు మొక్కుకున్నారు. శనివారం అర్థరాత్రి సింగపూర్ నుంచి శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీమతి అన్నా (Anna Konidela)గారు తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకొనేందుకు శ్రీమతి అన్నా కొణిదల గారు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ(TTD) నిబంధనలు అనుసరిస్తూ - గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు.
