పవన్ కళ్యాణ్ సజ్జల పై యాక్షన్ తీసుకోవడానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ సజ్జల పై యాక్షన్ తీసుకోవడానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. వై.సి.పి. పవర్ లో ఉన్నపుడు కీ ప్లేయర్ గా ఉండేవారు సజ్జల రామకృష్ణ రెడ్డి(Sajjala Ramakrishna Reddy). అప్పట్లో ప్రతిపక్షాలు సజ్జల టార్గెట్ గా చాల విమర్శలు ఆరోపణలు చేసేవారు. ముఖ్యంగా సోషియల్ మీడియాలో సన్ ఆఫ్ సజ్జల పై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. అప్పటి గవర్నమెంట్ లో సజ్జల ఫ్యామిలీ పై అవినీతి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ ఆ అవినీతి పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు.

కడప జిల్లా అటవీ భూముల విషయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీరియస్ అయినట్టు తెలుస్తోంది. భూములు ఎంత మేరకు కబ్జా అయ్యాయో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. కడప కలెక్టర్ తో ఈ విషయం గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పినట్టు తెలుస్తోంది.

వై.సి.పి. గవర్నమెంట్ లో రామకృష్ణ రెడ్డి.. చంద్రబాబు(Chandrababu Naidu), పవన్ లను టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. జగన్(Ys Jagan) తీసుకునే నిర్ణయాల వెనక కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఆ బిహేవియరే ఆయనకు రివర్స్ ఎఫెక్ట్ ఇవ్వనుంది. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఆయనపై కాన్సంట్రేట్ చేసేలా చేసింది అని స్వంత పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారట.

ehatv

ehatv

Next Story