ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అన్న క్యాంటీన్లు(Anna Canteen)మళ్లీ మొదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అన్న క్యాంటీన్లు(Anna Canteen)మళ్లీ మొదలయ్యాయి. పేదవారికి కేవలం అయిదు రూపాయలకే భోజనం అందించడం కోసం తెలుగుదేశంపార్టీ(TDP) సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్న క్యాంటిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడ‌త‌లో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడ(Gudivada)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu)చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అలాగే, మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు(MLA),ఎంపీలు(MP),ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాలలో ప్రారంభించనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అన్న క్యాంటిన్ల విషయంలో జనసేన కార్యకర్తలలో కించింత్‌ అసహసనం, ఆగ్రహం ఉంది. ప్రారంభించకూడదని కాదు కానీ ఎక్కడా తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)బొమ్మ లేకపోవడం. ఈ రోజున దిన పత్రికలలో ఇచ్చుకున్న ఫుల్ పేజీ అడ్వర్‌టైస్‌మెంట్‌లో కూడా పవన్‌ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉంది. పవన్‌ కల్యాణ్‌ కారణంగానే కూటమి అన్నేసి సీట్లను సాధించగలిగిందని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరుదాటాక సామెతను నిజం చేస్తున్నారా అన్న అనుమానం జనసైనికులకు కలుగుతోంది. తమ అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని, అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉన్నారని వపన్‌ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. సరే అడ్వర్‌టైస్‌మెంట్‌లో పొరపాటు జరిగిందనే అనుకుందాం! మరి పిఠాపురం(Pitapuram)లో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్‌ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా పవన్‌ ఫోటో పెట్టలేదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్‌ యాడ్‌లలో పవన్‌ ఫోటోను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టే అనిపిస్తోందని అంటున్నారు. దీనిపై తెలుగుదేశంపార్టీ ఓ వివరణ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ కూడా అక్కడక్కడ వినిపిస్తోంది. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ఎలా రియాక్టవుతారో చూడాలి.

ehatv

ehatv

Next Story