ఎన్నికల్లో గెలుపు తరువాత జనసేన కార్యకర్తలు ఊపు మీదున్నారు.

ఎన్నికల్లో గెలుపు తరువాత జనసేన కార్యకర్తలు ఊపు మీదున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో ఉరకలేస్తున్నారు. మరి ఈ ఊపు, ఉత్సాహాన్ని పార్టీకి పర్మినెంట్ గా ఉంచడానికి, మరింత మంది కార్యకర్తలు పార్టీలో చేరి జనసేన బలోపేతం అవడానికి.. జనసేనాని మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. దానికి కారణం ఆవిర్భావ సభ కాస్తా ప్లీనరీగా మారడమే.

సాధారణంగా మార్చి 14 న జనసేన ఆవిర్భావసభ జరుపుతారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో సభను ఉర్రూతలుగిస్తారు. కానీ ఈ సారి సీన్ మారింది. ఒక్కరోజు ఆవిర్భావ సభ కాకుండా.. మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మార్చి 12, 13, 14 తేదీల్లో ఇది జరగనున్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినప్పటికీ, ఆ పార్టీకి ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం సరిగా లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ ఇంకా తన బలాన్ని పెంచుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఇదే అజెండాగా ప్లీనరీ జరగనుంది అని సమాచారం. ఇందుకోసం విజయవాడలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.

ప్లీనరీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపి గ్రామ స్థాయిలో కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించబోతున్నారు. పవన్ అధికారంలో ఉండాగానే తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story