Deputy CM Pawan Kalyan Mass Warning: తోలు తీస్తాం.. మీ అహంకారం దించుతాం.. పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ కడప రిమ్స్ లో దౌర్జన్యానికి దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపిడిఓ జవహర్ బాబు ను డిప్యూటీ సి.ఎమ్. పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితిని గురించి అక్కడున్న వైద్యులను అడుగి తెలుసుకున్నారు. జవహర్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక మండలానికి మొత్తం అధికారి అయిన ఎంపిడిఓ పై దాడి చేయడం సాధారణ విషయంగా తీసుకుని అని.. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులకు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించామని ఆయన చెప్పారు.
ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం జవహర్ బాబు ఎస్సీ వర్గానికి చెందినవాడు అవడం మాత్రమే కాదని.. ఇలా జరిగితే మేమంతా ఉన్నామని, కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియడానికి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఇది వై.సి.పి. నాయకుల అహకరం అని.. ఆ అహంకారం తోనే అధికారం కోల్పోయారని అన్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే మీ అహంకారాన్ని తగ్గిస్తాం.. తోలు తీస్తాం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు కూడా మాట్లాడాలి, పోరాడాలి అని ఆయన కోరారు. రాయలసీమ యువతకు, ఆడపడుచులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఇలాంటి దౌర్జన్యాన్ని సహించొద్దని చెప్పారు.