Deputy CM Pawan Kalyan : జగన్ హయాంలో పంచాయతీ భవనాలకు రంగులేసేందుకు రూ. 4800 కోట్లు.. వాస్తవమేనా..!
వైసీపీ(YCP) హయాంలో 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు, ఇతర భవనాలకు రంగులు(Paints) వేసేందుకు రూ.4800 కోట్లు ఖర్చయిందన్నవార్తలు వాస్తవమేనా అని ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం వచ్చింది.
వైసీపీ(YCP) హయాంలో 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు, ఇతర భవనాలకు రంగులు(Paints) వేసేందుకు రూ.4800 కోట్లు ఖర్చయిందన్నవార్తలు వాస్తవమేనా అని ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం వచ్చింది. నిజంగానే 4800 కోట్లు ఖర్చు చేశారా అని జగన్‌పై(YS Jagan) దుమ్మెత్తిపోశాయి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు. శాసన మండలిలో సభ్యులు దువ్వారపు రామారావు(Duvvarapu rama rao), వేపాడ చిరంజీవి రావు(Vepadi chiranjeevi rao), బి.తిరుమలనాయుడు(B.Tirumala naidu) వేసిన ప్రశ్నకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) సమాధానం ఇచ్చారు. రూ.4800 కోట్ల ఖర్చు చేశారన్నది పూర్తిగా అవాస్తవమని సమాధానమిచ్చారు. 2019-24 మధ్య కాలంలో గ్రామసచివాలయాలకు రంగులు వేయడానికి మొత్తం ఖర్చు రూ.101.81 కోట్లు మాత్రమే అని తెలిపారు. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో రంగుల కొనుగోలుకు రూ.49.08 కోట్లు, పాత రంగు తీసి కొత్త రంగు వేయడానికి రూ.52.73 కోట్లు ఖర్చు చేశారని పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. దీంతో పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో రూ.4800 కోట్లు ఖర్చు చేశారని గతంలో దుమ్మెత్తి పోసిన వారు ఇప్పుడు కేవలం 101.81 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా మండలిలో అది కూడా డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన సమాధానం చూసి ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.