Kondapally Srinivas : పవన్ కల్యాణ్ పర్యటనలో మంత్రికి ఘోరం అవమానం!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalayan) విజయనగరం జిల్లా టూర్(Vijaynagaram tour) పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalayan) విజయనగరం జిల్లా టూర్(Vijaynagaram tour) పెట్టుకున్నారు. ఆ జిల్లాలోని గుర్లలో అతిసార వ్యాధితో 12 మందికిపైగా చనిపోయారు. రెండు వందల మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కొందరి పరిస్థితి సీరియస్‌గానే ఉంది. బాధితులను పరామర్శించడానికి పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లారు. గుర్ల ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అతసార రోగులను పవన్ పరామర్శిస్తున్న సమయంలో ఆయనతో పాటు ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli srinivas) ప్రయత్నించారు. అయితే ఆయనను పవన్ సెక్యూరిటీ(security) ఆపేశారు. జిల్లాకు చెందిన మంత్రినని ఆయన చెప్పుకున్నా సెక్యూరిటీ వినిపించుకోలేదు. పాపం మంత్రి అనుచరులు కూడా చెప్పి చూశారు. అయినా సెక్యూరిటీ లైట్ తీసుకున్నారు. దాంతో ఆసుపత్రి నుంచి పవన్ బయటకు వచ్చేంత వరకు మంత్రి గేటు బయటనే ఉండాల్సి వచ్చింది. మంత్రి అనుచరులకు కోపం వచ్చినా అక్కడేమి అనలేకపోయారు. కూటమి ప్రభుత్వంలోని సాటి మంత్రికి పవన్ కల్యాణ్ ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి వస్తే ఆయనను సాదరంగా లోపలికి పంపాల్సిన సెక్యూరిటీ ఇలా అడ్డు చెప్పడమేమిటని ఫైర్ అవుతున్నారు. విజయనగరం జిల్లా టీడీపీలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సంఘటనను టీడీపీ నేతలు అయితే తట్టుకోవడం లేదు.