తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని(Tirumala venkateshwara swamy) దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వెళుతుంటారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని(Tirumala venkateshwara swamy) దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అందులో చాలా మంది కాలినడకన కొండ ఎక్కుతారు. కొండ ఎక్కుతామని మొక్కుకునే వారు చాలా శ్రద్ధగా తిరుమలకు చేరుకుంటారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు కోనేటి రాయుడి దర్శనం కోసం శ్రమ అనేది తెలియకుండా కొండ ఎక్కుతారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి సమయం తీసుకుంటారు. కొందరికి రెండు గంటలు పడితే మరికొందరికి నాలుగు గంటలు పడుతుంది. ఎక్కువలో ఎక్కువ నాలుగున్నర గంటల్లో కొండ ఎక్కేయవచ్చు. ఇదంతా అలిపిరి(Alipiri steps) నుంచి వెళ్లేవారి గురించే! చాలా మంది కష్టం తెలియకుండా కొండపైకి చేరుకుంటారు. రోజూ మార్నింగ్‌ వాక్‌లు, జాగింగ్‌లు చేసేవారైతే మరింత ఈజీగా కొండ ఎక్కేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మార్షల్‌ ఆర్ట్స్‌లో(Martial arts) ఆరితేరి, రోజూ జిమ్‌ చేస్తూ వస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalayan) మాత్రం కొండ ఎక్కడానికి ఆపసోపాలు పడ్డారు. పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేసుకున్న పవన్‌ చివరి రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుంటానని ముందే చెప్పి ఉన్నారు కాబట్టి ఎక్కక తప్పలేదు. ఆయనకు తిరుమల చేరడానికి ఏకంగా నాలుగున్నర గంటలకు పైగా సమయం పట్టింది. ఆయన మెట్లు ఎక్కుతున్నప్పుడు వ్యక్తిగత సిబ్బంది అయితే బాగా టెన్షన్‌ పడ్డారు. కొండ ఎక్కగలరా అన్న సందేహం కూడా చాలా మందికి కలిగింది. అలాగని పవన్‌ కల్యాణ్‌ వయసేమీ పెద్దది కూడా కాదు. జస్ట్‌ 53 ఏళ్లే! ఈ వయసు వారు చకచకా మెట్లు ఎక్కేస్తారు. ర్ఓజూ జిమ్‌ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌కు అంత సేపు ఎందుకు పట్టిందా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. మోకాళ్ల పర్వతం నుంచి పవన్‌ కల్యాణ్‌ కారులో తిరుమలకు వెళతారనే ప్రచారం జరిగింది. అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పవర్‌స్టార్‌ చాలా పట్టుదలగా కష్టపడి, ఆయాసపడుతూ పూర్తిగా కొండ ఎక్కారు. ఇందుకు ఆయనను అభినందించి తీరాలి!

Eha Tv

Eha Tv

Next Story