Deputy CM K Narayana Swamy : 'చంద్రబాబు అండ్ కో' హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు
చంద్రబాబు నాయుడు అండ్ కో హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు నాయుడు(Chandrababu Naodu) అండ్ కో హమాస్(Hamas) ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి(Deputy CM K Narayana Swamy) మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు బెయిల్(Bail) ముగిసే సమయానికి గుండె పోటు వచ్చిందని కూడా డ్రామా స్టార్ట్ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మా భువనేశ్వరి(Bhuvaneshwari) నిజం గెలవాలి అంటే.. నీ తండ్రి నందమూరి తారక రామారావు(Nandamuri Tharakarama Rao) స్థాపించిన తెలుగుదేశం పార్టీ(Telugudesham Party)ని ఏవిధంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడో నువ్వే నిజం చెప్పాలి తల్లి అని వ్యాఖ్యానించారు.
పదవికాంక్షతో ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెడితే.. చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడని అన్నారు. నందమూరి తారక రామారావు ఫాలోయింగ్ తో పార్టీని గెలిపించారని.. ఆయన ఫాలోయింగ్ తో గెలిచిన ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిది మోసం కాదా అని ప్రశ్నించారు. ఇవన్నీ నిజమా.. అబద్ధమా.. అనేది ప్రజలకు చెప్పాలన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది చంద్రబాబు నాయుడు ఇది న్యాయమా.. అన్యాయమా.. అనేది భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు. నిజం గెలిచింది కనుకే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. నిజం ఎప్పుడూ గెలవాలని నేను కూడా కోరుకుంటానన్నారు. చరిత్రను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే.. చరిత్ర సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
న్యాయస్థానాలను మొదటి నుండి చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తూ వచ్చారని అన్నారు. ప్రస్తుతం న్యాయస్థానాలు కళ్ళు తెరిచాయి కనుకే చంద్రబాబు నాయుడు జైలు జీవితం అనుభవించారు. చంద్రబాబు నాయుడు లాయర్లు ఎవరూ కూడా ఆయన అవినీతి చేయలేదని వాదించలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు బెయిల్ వచ్చింది అంటే ఆయన కంటి ఆపరేషన్ కోసమని మానవతా దృక్పథంతో మాత్రమే బెయిల్ మంజూరు చేశారు కానీ.. ఆయన బయటకు వచ్చి సభలు, సమావేశాలు పెట్టుకోమని కాదన్నారు.
పచ్చ పత్రికలు, ఛానల్‌లలో నిజాలు రాయడం లేదన్నారు. ఆ పచ్చ పత్రికలు, ఛానల్స్ ఒక కులానికి సంబంధించినవని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశాడో, ప్రజలకు ఏం చేశాడో, అభివృద్ధి ఏం చేశాడో నిరూపించమనండి.. నేను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు.