ఆంద్రప్రదేశ్‌లో(andhra Pradesh) టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే నాలుగు ఛానల్స్ ప్రసారాలు(Channels telecast) నిలిపివేశారు.

ఆంద్రప్రదేశ్‌లో(andhra Pradesh) టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే నాలుగు ఛానల్స్ ప్రసారాలు(Channels telecast) నిలిపివేశారు. కేబుల్ ఆపరేటర్లకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని టీడీపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంటూ వైసీపీకి(YCP) చచెందిన ఎస్‌ నిరంజన్‌రెడ్డి(S Niranjan reddy) కేంద్ర అధికారులకు, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు(CM chandrababu) లేఖ రాశారు. సాక్షి(Sakshi), టీవీ9(TV9), ఎన్టీవీ(NTv),10 టీవీ(10tv) ప్రసారాలు ఆగిపోయాయని ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చానెళ్లపై నిషేధం విధించారని సమాచారం. ఎన్నికలకు ముందు ఈ చానెళ్లు జగన్‌ కోసం పనిచేశాయన్న ఆరోపణలపై ప్రసారాలు బంద్‌ చేశారు.

జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారాన్ని నిలిపివేసిన నాలుగు తెలుగు న్యూస్ ఛానెల్స్ - టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, 10TV, NTV ప్రసారాలను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) దాదాపు 15 మంది కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనలను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించడమేనని టీవీ9 చేసిన పిటిషన్‌లో జస్టిస్ మినీ పుష్కర్ణతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వార్తా ఛానళ్లను వెంటనే పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం ఖండించింది. దీనిపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. భావ ప్రకటనాస్వేచ్ఛ, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తాచానెళ్ల ప్రసారాలు ఆపడం సరికాదని బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. అయితే కోర్టు తీర్పు వల్లనో, మరి ప్రభుత్వ వర్గాలు చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై వెనుకడుగు వేశారో కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కేబుల్స్, డీటీహెచ్‌లో టీవీ9, ఎన్టీవీ ప్రసారాలైతే యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నికొన్ని కేబుళ్లలో ప్రసారాలు బంద్‌ ఉన్నప్పటికీ ఢిల్లీ హైకోర్టు తీర్పుతో పలు కేబుళ్లలో చానెళ్ల ప్రసారాలు కొనసాగుతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story