బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్, 11 కేసులు.. లక్షల్లో మోసగించడం, బంగారం, డబ్బు దోచుకోవడం, బెదిరింపులు ఇవ్వన్నీ దావులూరి పద్మావతి ఇంకా ఆపడం లేదు.

బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్, 11 కేసులు.. లక్షల్లో మోసగించడం, బంగారం, డబ్బు దోచుకోవడం, బెదిరింపులు ఇవ్వన్నీ దావులూరి పద్మావతి ఇంకా ఆపడం లేదు. ఇటీవల కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై దాడి చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేసిన ప్రభావతి.. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయిన జనసేన నాయకుడు. అనేక వివాదాల తర్వాత నాటి గత ప్రభుత్వ హయాంలో మంత్రులను, తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, హోంమంత్రి అనితను సైతం కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్న ప్రభావతి. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్నవారు మొహం చాటేశారు. దీంతో ఇటీవల డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రభావతి.. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలో స్థానిక జనసేన నాయకులను సమగ్ర వివరాలు కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ వ్యవహారాలను చూసుకున్న దోనవల్లి వెంకట్రావు.. పవన్ కళ్యాణ్‌కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడని కక్ష పెంచుకున్న ప్రభావతి. ఈ క్రమంలో వెంకట్రావు పై ప్రభావతి, తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడి చేసింది. చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టడాన్ని గమనించి ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసిన గ్రామస్థులు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించిన నూజివీడు రూరల్ పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

ehatv

ehatv

Next Story