Dastagiri : వివేకం సినిమాపై కోర్టును ఆశ్రయించిన దస్తగిరి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమాపై అప్రూవర్ దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా ప్రదర్శనను ఆపాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.
వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య నేపథ్యంలో తీసిన వివేకం(Vivekam) సినిమాపై అప్రూవర్ దస్తగిరి(Dastagiri) హైకోర్టును ఆశ్రయించారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా ప్రదర్శనను ఆపాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉండగా.. సినిమా తెరకెక్కించడంపై దస్తగిరి పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశాడు. పిటీషన్‌లో తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్‌ను ప్రతివాదులుగా చేర్చాడు. ఐటీడీపీ ప్రోత్సాహంతోనే వివేకం సినిమా అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ప్రదర్శించబడుతుందని.. తక్షణమే ఈ సినిమా ప్రదర్శన నిలుపుదల చేయాలని పిటీషనర్ కోరాడు.
పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులకు భంగం కలిగిస్తుందని పిటిషనర్ పేర్కొన్నాడు. సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా ప్రదర్శించబడుతుందని.. నిలుపుదలపై తక్షణమే ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు ఇవ్వవలసిందిగా తన పిటీషన్ లో కోరాడు. పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారు.