ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో మొదటిసారిగా విశాఖపట్నం(Vishakapatnam)లోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ(DSNLU)విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు(Menstrual leave)ను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో మొదటిసారిగా విశాఖపట్నం(Vishakapatnam)లోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ(DSNLU)విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు(Menstrual leave)ను ప్రకటించింది. కేవలం మెయిల్‌ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కలిగించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌(Medical Certificate) సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజిస్ట్రార్‌ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(executive council) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మన దేశంలో ఇలాంటి విధానం ఎనిమిది యూనివర్సిటీలలో అమలవుతోంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ(HNLU), ముంబాయి(Mumbai),ఔరంగాబాద్‌లలో ఉన్న మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీలు(MNLU),భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ(NLIU Bhopal),జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ( Jabalpur DNLU), హైదరాబాద్‌లోని నల్సార్(NALSAR),అసోంలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడిషియల్‌ అకాడమీ(NLUJA)ల్లో ఈ విధానం అమలవుతోంది.

ehatv

ehatv

Next Story