విజయవాడ(Vijayawada) నగరంలో నిర్మితమైన అతి పెద్ద అంబేద్కర్‌(dr.ambedkar statue) విగ్రహం ప్రాంగణంపై కొందరు దుండగులు దాడి చేశారు

విజయవాడ(Vijayawada) నగరంలో నిర్మితమైన అతి పెద్ద అంబేద్కర్‌(dr.ambedkar statue) విగ్రహం ప్రాంగణంపై కొందరు దుండగులు దాడి చేశారు. అక్కడి శిలాఫలకం మీద ఉన్న జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పేరును ధ్వంసం చేశారు. ఆ ఫలకాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఈ దాడి ఎవరు చేశారన్నది చెప్పాల్సిన పనిలేదనుకుంటాను! తెలుగుదేశంపార్టీ(TDP) వారే దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) నాయకులు అంటున్నారు. నిజమే కదా! టీడీపీ వారు తప్పితే ఇంకెవరు వచ్చి దాడి చేస్తారు? జగన్‌ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తారు? దీనిపై దళిత సంఘాలు కూడా మండిపడుతున్నాయి. నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పేరును తొలగించారు కాబట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంకాస్త ఎక్కువ నిరసనలు వ్యక్తం చేయవచ్చు కానీ, ఈ దాడిని పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం! పోలీసులు ఎదురుగానే టీడీపీకి చెందిన వారు అంబేద్కర్‌ స్మృతివనం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నవారందరినీ తరిమేసి, సిబ్బంది ఫోన్లను గుంజుకుని, శిలాఫలకం మీద జగన్మోహన్‌రెడ్డి పేరును ధ్వంసం చేస్తుంటే పోలీసులు నిమిత్తమాత్రులై నిల్చుండిపోయారే తప్ప వీసమెత్తు యాక్షన్‌ కూడా తీసుకోలేదు. అంటే ఓ రకంగా పోలీసులు సహకరించారనే అనుకోవాలి. నిజానికి అంబేద్కర్‌ స్మృతి వనానికి చంద్రబాబునాయుడుకు సంబంధమే లేదు. టీడీపీ ముద్ర కూడా ఆ విగ్రహంపై లేదు. అది పూర్తిగా జగన్‌ ఆలోచనే! జగన్‌ పాలనలోనే నిర్మితమైన ఎత్తయిన విగ్రహం అది! అలాంటప్పుడు శిలాఫలకం మీద జగన్మోహన్‌రెడ్డి పేరు ఉండాలి కానీ చంద్రబాబు పేరు ఉండకూడదు కదా! జగన్‌ పేరు ఉంటే ఎందుకు టీడీపీ నాయకులకు కాలుతోంది? ఈ ఓర్వలేని తనం ఎందుకు? ఇది అంబేద్కర్‌ మీద దాడి కాకపోవచ్చు కానీ జగన్‌ పేరును తొలగించడం మాత్రం తప్పదమే. దుర్మార్గమే!

Eha Tv

Eha Tv

Next Story