మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే(Narendra modi) దక్కుతుందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. సోమవారం మీడియాతో(Media) మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీకి స్పష్టత ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదిన్నరేళ్ళలో అవినీతి రహిత పాలన చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్(CM jagan) సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే(Narendra modi) దక్కుతుందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. సోమవారం మీడియాతో(Media) మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీకి స్పష్టత ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదిన్నరేళ్ళలో అవినీతి రహిత పాలన చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్(CM jagan) సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు కాకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని.. కరువు మండలాలపై సీఎం జగన్ శీతకన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. టీటీడీలో (TTD)అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారని.. టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోయి పరాకాష్టకు చేరిందన్నారు. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారన్నారు. సర్పంచ్‌లకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని, ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

సామాజిక బస్సు యాత్ర(Bus yatra) నిర్వహించే అర్హత వైసీపీకి లేదు : ఏపీలో వైసీపీ(YCP) విధ్వంసక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారన్నారని ఆరోపించారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని పురందేశ్వరి అన్నారు. బీసీ, ఎస్సీలపై దాడులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విమర్శించారు. సామాజిక బస్సు యాత్ర నిర్వహించే అర్హత వైసీపీకి లేదని పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో జాతీయ నేత బీఎల్‌ సంతోష్‌తో పాటు సోము వీర్రాజు, సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కొడాలి నానికి(Kodali Nani) పురేంధేశ్వ‌రీ కౌంట‌ర్ : కొడాలి నానికి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్‌ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారన్నారు. దేవుడి విగ్రహాల నుంచి గర్బ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోడీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారని, టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు.

Updated On 20 Nov 2023 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story