తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి నియామకాలపై ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు(TTD Board) రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeshwari)

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి నియామకాలపై ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు(TTD Board) రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు. బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి(sharath chandra Reddy), కేతన్ దేశాయ్(Ketan Desai) నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీ మద్యం స్కాం లో శరత్చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎంసీఐ స్కాం లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని బీజేపీ ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.

Updated On 26 Aug 2023 3:26 AM GMT
Ehatv

Ehatv

Next Story