Dhadi Veerabhadra Rao : టీడీపీలోకి వెళ్లిన దాడి వీరభద్రరావుది చిత్రమైన పరిస్థితి
సీనియర్ రాజకీయ నాయకుడు, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన దాడి వీరభద్రరావుకు(Dhadi Veerabhadra Rao) చిత్రమైన పరిస్థితి వచ్చింది. మళ్లీ తెలుగుదేశం పార్టీలో(Yshu) చేరినప్పటి నుంచి ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఉంటే దాడికి వచ్చిన నష్టమేమింటారా? ఈ ఇద్దరూ తెలుగుదేశంపార్టీలో ఉన్నప్పుడు రెండు వర్గాలుగా ఉంటూ వచ్చారు. మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కూడా దాడి వీరభద్రరావుకు పడేది కాదు.
సీనియర్ రాజకీయ నాయకుడు, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన దాడి వీరభద్రరావుకు(Dhadi Veerabhadra Rao) చిత్రమైన పరిస్థితి వచ్చింది. మళ్లీ తెలుగుదేశం పార్టీలో(Yshu) చేరినప్పటి నుంచి ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఉంటే దాడికి వచ్చిన నష్టమేమింటారా? ఈ ఇద్దరూ తెలుగుదేశంపార్టీలో ఉన్నప్పుడు రెండు వర్గాలుగా ఉంటూ వచ్చారు. మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కూడా దాడి వీరభద్రరావుకు పడేది కాదు. ప్రస్తుతం కొణతాల జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎవరినైతే వ్యతిరేకిస్తూ వచ్చారో, ఎవరి మొహం అయితే చూడటానికి ఇష్టపడలేదో ఇప్పుడు వారితోనే కలిసి పని చేయాల్సిన దుస్థితి దాడి వీరభద్రరావుకు వచ్చింది. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన(Janasena) తరఫున కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా రామకృష్ణను గెలుపించుకోవాల్సిన బాధ్యత దాడి వీరభద్రరావుపై ఉంది. మరోవైపు కూటమి నుంచి సీఎం రమేశ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈయన మద్దతుగా కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆయన కోసం పని చేయాల్సి ఉంటుంది. పాపం ఎన్నో ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను(YSR Congress) వదిలిపెట్టి తెలుగుదేశంపార్టీలో చేరారు దాడి వీరభద్రరావు. తన కుమారుడికి టికెట్ సంపాదించుకోవాలని చాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయ్యింది. మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఎన్నికల్లో టికెట్లు దొరికాయి. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే దాడి వీరభద్రరావుకు ఏమైనా మేలు జరగవచ్చేమో కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం కనిపించడం లేదు. అధికారంలోకి వస్తే దాడికి కచ్చితంగా ఏదో ఒక పదవి అప్పగిస్తామని టీడీపీ అంటోంది కానీ మాట మీద నిలబడుతుందన్న నమ్మకం దాడికి లేదు. కారణం ఇలాంటి హామీలను చాలా మంది నేతలకు ఇచ్చింది టీడీపీ. సీఎం రమేశ్ మాత్రం చాలా తెలివిగా అటు దాడిని, ఇటు అయ్యన్నపాత్రుడుని కలుపుకుని వెళుతున్నారు. అయ్యన్నపాత్రుడిని నేరుగా కలిసిన సీఎం రమేశ్ ఆ తర్వాత దాడి వీరభద్రరావును కూడా కలుసుకున్నారు. తనకు రాజకీయగురువు ఎవరైనా ఉన్నారంటే అది దాడి వీరభద్రరావేనని, ఆయన దగ్గర తాను ఎన్నో నేర్చుకున్నానని వినయంగా చెప్పుకున్నారు సీఎ రమేశ్. ఎన్నికల్లో గెలవాలంటే ఈ మాత్రం వినయ విధేయతలు అవసరమేనని జనం అనుకుంటున్నారు.