ఉత్తర కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, మలక్కా జలసంధి ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.

ఉత్తర కోస్తా(North Coast)కు తుఫాన్ ముప్పు(Cyclone Threat) పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ(Department of Meteorology) హెచ్చ‌రించింది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం(South Andaman Sea), మలక్కా జలసంధి ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో.. ఈ నెల 29వ తేదీ కల్లా వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం(Southeast Bay of Bengal)లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తరువాత రెండు రోజులు వాయువ్యంగా పయనించి వచ్చేనెల ఒకటో తేదీకల్లా తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని వచ్చే నెల‌ 4వ తేదీకల్లా తీవ్ర తుఫాన్ గా బలపడుతుందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. 5వ తేదీ కల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Updated On 27 Nov 2023 10:38 PM GMT
Yagnik

Yagnik

Next Story