Tirupathi : తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది.

Crowd of devotees increased again in Tirumala
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. రూ.300 శీఘ్ర దర్శనంకు 2 నుంచి 4 గంటల సమయంం పడుతుందని వెల్లడించింది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,115 కాగా.. 32,711 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.23 కోట్లు అని టీటీడీ వెల్లడించింది.
