Biased Media Coverage:జగన్ ను తిడితే ఫ్రంట్ పేజీ, కూటమిని విమర్శిస్తే 12వ పేజీ
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను జనం ఎందుకు చీదరించుకుంటారు అంటే తమకు నచ్చే వార్తలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తుంటాయి కాబట్టి.
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను జనం ఎందుకు చీదరించుకుంటారు అంటే తమకు నచ్చే వార్తలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తుంటాయి కాబట్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని(Ys Jagan) ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది మొదటి పేజీలో వస్తుంది. అనేవాడు అనామకుడు అయినా సరే, ప్రముఖంగా ప్రచురించాలి. అది నియమం. అదే తెలుగుదేశం పార్టీని(TDP) ప్రధాని వంటి వారు విమర్శించినా అది వారికి వార్త కాదు. ఆరో పేజీలోనో, ఎనిమిదో పేజీలోనో సింగిల్ కాలమ్ వార్త అవుతుంది. సపోజ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) నే తీసుకుందాం. ఆమె అంటే ఒక మీడియా సంస్థకు ఎంతో అభిమానం. ఆమె జగన్ ను ఆడిపోసుకుంటుంటారు కాబట్టి. ఆమె జగన్ ను విమర్శిస్తే మొదటి పేజీలో వస్తుంది. ఆమెకు ప్రయారిటీ ఇస్తుంది. షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కాబట్టి, ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు తిట్టి తిట్టనట్టు, కూటమి పభుత్వం పై విమర్శలు చేస్తుంటారు. ఆస్తి గొడవలకు ఆ మీడియా ఇచ్చినంత ప్రాధాన్యత మరే మీడియా ఇవ్వలేదు. ఉచిత సిలిండర్ల(Free Gas) విషయం పై షర్మిలా రెడ్డి కొన్ని విమర్శలు చేశారు. లెక్కకైతే ఆ న్యూస్ కూడా మొదటి పేజీలో రావాలి. కానీ రాలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, కరెంట్ చార్జీల పై షర్మిల చేసిన విమర్శలు ఎక్కడో చిన్నగా సింగిల్ కాలం లో వచ్చింది.