మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు కదా! ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని వైసీపీ (YCP) ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దాన్ని అంబటి రాయుడు రీ ట్వీట్‌చేశారు. ‘మన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్‌’ అంటూ కొనియాడారు. అంతే..అంబటి రాజకీయాల్లోకి వచ్చేందుకే జగన్‌ను (CM Jagan) పొగుడుతున్నారంటూ కథనాలు వచ్చాయి.

అంబటి రాయుడు (Ambati Rayudu).. తెలుగు క్రికెటర్లలో ఒకరు. ఒకప్పుడు టీమిండియా ప్లేయర్‌... కాకపోతే టీమ్‌లో తన ప్లేస్‌కు కాంక్రీట్‌ వేసుకోలేకపోయాడు. అంతకు ముందు దేశవాళీ క్రికెట్‌లో కూడా అంతే! ఏ టీమ్‌లోనూ శాశ్వతంగా ఉండలేదు. మంచి క్రికెటరే! బ్యాటర్‌గా చెప్పుకోదగ్గర పరుగులే చేశాడు. గాడ్‌ఫాదర్లు లేకపోవడం కూడా ఓ లోటే! ఇప్పుడీ ఇంట్రో ఎందుకుంటే పాలిటిక్స్‌లో చేరే ఛాన్స్‌ ఉండటమే! ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీలో చేరబోతున్నట్టు పెద్ద ప్రచారమే జరుగుతోంది. అందుకు కారణం రెండు రోజుల కిందట వైసీపీ తన అఫిషియల్‌ ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్‌కు రీట్వీట్‌ చేయడమే!

మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు కదా! ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని వైసీపీ (YCP) ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దాన్ని అంబటి రాయుడు రీ ట్వీట్‌చేశారు. ‘మన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్‌’ అంటూ కొనియాడారు. అంతే..అంబటి రాజకీయాల్లోకి వచ్చేందుకే జగన్‌ను (CM Jagan) పొగుడుతున్నారంటూ కథనాలు వచ్చాయి. గతంలో ఓసారి తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని రాయుడు చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడుది కాపు సామాజికవర్గం. మొదట్లో ఇతడు జనసేన పార్టీలోకి వెళతాడని అందరూ అనుకున్నారు. కొందరేమో అబ్బే.. తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీ అభిమానులు చెప్పారు. మధ్యలో బీఆర్‌ఎస్‌ కూడా రాయుడిని ట్రై చేసిందట. ఇప్పుడేమో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Updated On 21 April 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story