తాజగా రాయుడు జగన్ తో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది. రాబోయే ఎన్నికల్లో అంబటి రాయుడు వైసీపీ నుంచి గుంటూరు జిల్లాలోని ఎదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు.. కానీ దీనిపై మాత్రం అటు పార్టీనుంచి కానీ.. ఇటు అంబటి రాయుడు అనుచరుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ (CSK) బ్యాటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ (CM jagan) తో భేటీ అయ్యారు.. గత కొంత కాలంగా అయన వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.. కానీ దీనిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు.. తాజగా రాయుడు జగన్ తో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది. రాబోయే ఎన్నికల్లో అంబటి రాయుడు వైసీపీ (YCP) నుంచి గుంటూరు జిల్లాలోని ఎదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు.. కానీ దీనిపై మాత్రం అటు పార్టీనుంచి కానీ.. ఇటు అంబటి రాయుడు అనుచరుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఇటీవల సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా వైసిపి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దానికి అమ్బటి రాయుడు జగన్ ని పొగుడుతూ ట్వీట్ చేసాడు.. అప్పటి నుంచి అయన పటిలో చేరబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేసాయి.

Updated On 11 May 2023 3:22 AM GMT
Ehatv

Ehatv

Next Story