కర్నూలు: కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేసే వరకు పోరాటం సాగిస్తామని సిపిఎం పొలిట్‌ బ్యూరో(CPM Polit Bureau) సభ్యులు బివి రాఘవులు(BV Raghavulu) అన్నారు. జిల్లా సమగ్ర అభివద్ధి కోసం సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కర్నూలు కలెక్టరేట్‌(Collectorate) ఎదుట మహా ధర్నా నిర్వహించారు. అంతకుముందు నగర శివారులోని తాజ్‌ ఫంక్షన్‌ హాల్‌(Taj Functiona Hall) నుంచి ప్రారంభమైన సిపిఎం మహాపాదయాత్ర బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండు, మౌర్య ఇన్‌ కూడలి, రాజ్‌ విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ జన సందోహం మధ్య కొనసాగింది.

ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలి
మహా ధర్నాలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు

కర్నూలు: కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేసే వరకు పోరాటం సాగిస్తామని సిపిఎం పొలిట్‌ బ్యూరో(CPM Polit Bureau) సభ్యులు బివి రాఘవులు(BV Raghavulu) అన్నారు. జిల్లా సమగ్ర అభివద్ధి కోసం సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కర్నూలు కలెక్టరేట్‌(Collectorate) ఎదుట మహా ధర్నా నిర్వహించారు. అంతకుముందు నగర శివారులోని తాజ్‌ ఫంక్షన్‌ హాల్‌(Taj Functiona Hall) నుంచి ప్రారంభమైన సిపిఎం మహాపాదయాత్ర బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండు, మౌర్య ఇన్‌ కూడలి, రాజ్‌ విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ జన సందోహం మధ్య కొనసాగింది. పలు సంఘాల నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశారు అధ్యక్షతన నిర్వహించిన మహా ధర్నాలు బివి రాఘవులు మాట్లాడుతూ సిపిఎం నాయకులు జిల్లా అభివృద్ధి కోసం పాదయాత్ర చేశారన్నారు. గతంలోనూ సిపిఎం నాయకులు ఇలాంటి పాదయాత్రలను చేశారని, పాదయాత్ర తర్వాత కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, ఆ తరువాత శంకుస్థాపన రాళ్లు కూడా పోయాయని తెలిపారు. విద్య, వైద్యం, నీటిపారుదల, పారిశ్రామికంగా కర్నూలు జిల్లా వెనుకబడి ఉందన్నారు. అప్పుడు చంద్రబాబు రంగులేసిపోతే ఇప్పుడు జగన్‌ జిల్లాకు పంగనామాలు పెడుతున్నారన్నారు. జిల్లాకు మేలు చేయలేని ఆర్థిక శాఖ మంత్రి ఎందుకని, రాజీనామా చేసి కూర్చోవాలని తెలిపారు. గుండ్రేవుల, వేదవతి నీళ్లు వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమకు మొదట నీళ్ళు ఇవ్వాలని గతంలోనే చెప్పామని పాలకులు పట్టించుకోవడంలేదని అన్నారు. రాయలసీమలో పుట్టి ఎక్కడో సేవ చేస్తున్నారని ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించారు.

రాయలసీమ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్ప రాయలసీమకు ఏమి కావడం లేదని అన్నారు. పాలకులపై ఆధారపడితే ఏమి కావడం లేదని మన కాళ్లపై నిలబడి పోరాడాలని, పిలుపునిచ్చారు. నాయకులు గెలిస్తే వాళ్లకు మేలు కలుగుతుంది తప్ప ప్రజలకు ఏమి కాదని, ప్రజలు గెలిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుందని అన్నారు. కర్నూలు జిల్లా ముందుకు పోవాలంటే ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరన్నారు. ఉమ్మడి పౌరస్మృతి గురించి టిడిపి వైసిపి మాట్లాడటం లేదని, ఇద్దరు చట్టాపట్టాలేసుకొని బీజేపీకి ఊడిగం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగులకు, వీఆర్‌ఏలకు కిరీటాలు పెడతామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు బట్టలు ఊడదీసే పని చేస్తున్నారన్నారు. వేదవతి గుండ్రేవుల పూర్తి చేయాలని, రైల్వే వేగం వర్క్‌ షాప్‌ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మిగతా జిల్లాలతో సమానంగా కర్నూలును అభివృద్ధి చేయాలన్నారు.

పిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా కొన్ని అంశాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో జిల్లా అభివృద్ధికి జగన్‌ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని వారికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడి ఉందని, భూకబ్జాల్లో ముందుందని తెలిపారు. అక్రమ వ్యాపారాలకు వైసిపి ఎమ్మెల్యేలు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గతంలో టిడిపి,ఇప్పుడు వైసిపి జిల్లాకు చేసిన అన్యాయాన్ని వివరించాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు విద్య, వైద్యంలో అభివృద్ధి సాధించేవరకు పోరాడాలన్నారు. సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప మద్దతు తెలిపి మాట్లాడారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.ఎస్‌.రాధాకృష్ణ, కెవి.నారాయణ, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, పి.నిర్మల, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Updated On 7 Aug 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story