CPM Srinivas Rao : ఎన్నికలయ్యాక టీడీపీ, బీజేపీల అడ్రస్ ఉండదు... సీపీఎం విమర్శలు
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) ఎప్పుడు ఏ పార్టీ పంచన చేరతారో, ఎప్పుడు ఏ పార్టీతో జతకడతారో ఎవరికీ తెలియదు. అది ఆయన నైజం. ఇది తెలుగు ప్రజలందరికీ తెలుసు. తెలియనిదల్లా వామపక్ష పార్టీలకే! చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయాలపై మిరియమంత అవగాహన ఉన్నవారికి కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో తలపండిపోయిన వామపక్షాలకు మాత్రం తెలియదు.
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) ఎప్పుడు ఏ పార్టీ పంచన చేరతారో, ఎప్పుడు ఏ పార్టీతో జతకడతారో ఎవరికీ తెలియదు. అది ఆయన నైజం. ఇది తెలుగు ప్రజలందరికీ తెలుసు. తెలియనిదల్లా వామపక్ష పార్టీలకే! చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయాలపై మిరియమంత అవగాహన ఉన్నవారికి కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో తలపండిపోయిన వామపక్షాలకు మాత్రం తెలియదు. తెలియకుండానే చంద్రబాబుకు దగ్గరవ్వాలనుకున్నాయి. భవిష్యత్తులో పొత్తు కూడా పెట్టుకోవాలని భావించాయి. ఇప్పుడు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌తో(Pawan kalyan) పాటు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దలను కలుసుకున్నారు. పొత్తు ఆల్‌మోస్టాల్ కాన్ఫార్మ్ అయ్యిందని టీడీపీ అనుకూల మీడియా చెబుతున్నది. పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ అప్పుడే వామపక్ష పార్టీలు స్వరం పెంచాయి. ఆంధప్రదేశ్‌లో సీపీఎం, సీపీఐలకు పెద్దగా బలం లేకపోయినా ఆ పార్టీలకు ఉండాల్సిన ఓటు బ్యాంకు అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడంలో సీపీఎం(CPI), సీపీఐలు(CPI) ఎప్పుడూ ముందుంటాయి. చంద్రబాబుతో సీపీఐకి మంచి దోస్తానా ఉంది. అలాగని సీపీఎంతో లేదని కాదు. కాకపోతే అంత దగ్గర ఫ్రెండ్‌షిప్ లేదు. అందుకే బీజేపీతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతుండటం సీపీఎంకు నచ్చలేదు. బీజేపీతో టీడీపీ పొత్తుకు ప్రజల మద్దతు ఉండదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు(V. Srinivas Rao) అంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు అడ్రస్ వెతుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడమంటే నమ్మించి గొంతు కోయడమే అవుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినట్టేనని చెప్పారు.