కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని సీపీఐ నారాయణ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సీపీఐకి కొత్త ఆప్షన్‌ దొరికిందన్నారు. బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యూలర్‌ పార్టీతోనైనా జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని సీపీఐ నారాయణ(CPI Narayana) అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(COngress) మధ్యే పోటీ ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తెలంగాణ(Telangana)లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) పొత్తులకు సీపీఐ(CPI)కి కొత్త ఆప్షన్‌ దొరికిందన్నారు. బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యూలర్‌ పార్టీ(Secular Party)తోనైనా జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ(Narendra Modi), అమిత్‌ షా(Amith Shah)లు నాయకత్వం వహించినా బీజేపీ ఓటమి పాలైందన్నారు. కర్ణాటక ఫలితాల(Karnataka Results)తో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూతపడ్డాయన్నారు.

ఏపీ(Andhra Pradesh)లో అందరూ మోదీ(Modi)కి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారని.. కర్ణాటక తీర్పుతోనైనా వారిలో మార్పు రావాలన్నారు. మోదీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ(TDP), పవన్(Pawan) తమ పంథా మార్చుకొని బీజేపీ వ్యతిరేక లైన్‌ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. కర్ణాటకలో కమ్యూనిస్టులు(Communist) 212 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామ‌ని తెలిపారు.

Updated On 14 May 2023 10:51 PM GMT
Yagnik

Yagnik

Next Story