సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో పోలింగ్‌(Telangana Polling) జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని నాగార్జునసాగర్‌(Nagarjuna sagar) వద్ద జగన్‌(Jagan) ప్రభుత్వం నాటకమాడిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను(KCR) గెలిపించడం కోసం జ‌గ‌న్‌ కుట్ర పన్నారని ఆరోపించారు.

సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో పోలింగ్‌(Telangana Polling) జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని నాగార్జునసాగర్‌(Nagarjuna sagar) వద్ద జగన్‌(Jagan) ప్రభుత్వం నాటకమాడిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను(KCR) గెలిపించడం కోసం జ‌గ‌న్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ జగన్ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించార‌ని.. ఆయనకు ఇప్పుడే నీళ్లు ఎందుకు గుర్తొచ్చాయి.? అని ప్ర‌శ్నించారు. జగన్‌ కుటిల ప్ర‌యత్నాలు బెడిసికొట్టాయని కామెంట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని(Revanth Reddy) శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రానుందన్నారు. ప్రశ్నిస్తున్నాడని ఒక్కపుడు కేసీఆర్.. రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని.. అదే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడీగా ఉండాలన్నారు. తెలంగాణలో హంగ్ ప్రభుత్వం రాదని.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఐదేళ్ళ పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడుపుతోందని తెలిపారు. కేసీఆర్ లాంటి నియంత కంటే.. ఐదేళ్ళల్లో ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా పర్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపుకు పోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలవబోతోందని.. అహంభావం ఓడిపోతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్, కవితవి దింపుడు కల్లం ఆశలని ఆయన వ్యాఖ్యలు చేశారు.

Updated On 1 Dec 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story