CPI Narayana : విశాఖపట్నం రాజధాని అనే మాట అబాసు పాలైంది
విశాఖపట్నం(Vishakapatanam) రాజధాని అనే మాట ఆబాసు పాలైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Naryana) అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా గంజాయి(Weed), బెట్టింగ్(Betting) దందా నడుస్తుందని అన్నారు. ఆ దందా పరాకాష్టకు చేరి ఒక అనామకుడి దగ్గర 350 కోట్ల రూపాయల దొరికాయంటే ఈ దందా ఏ మేరకు నడుస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.
విశాఖపట్నం(Vishakapatanam) రాజధాని అనే మాట ఆబాసు పాలైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Naryana) అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా గంజాయి(Weed), బెట్టింగ్(Betting) దందా నడుస్తుందని అన్నారు. ఆ దందా పరాకాష్టకు చేరి ఒక అనామకుడి దగ్గర 350 కోట్ల రూపాయల దొరికాయంటే ఈ దందా ఏ మేరకు నడుస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందులో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో తెలవదని పేర్కొన్నారు. బెట్టింగ్, గంజాయి ముఠాల కార్యకలాపాలు అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా జరగవని, విజయవాడ కేంద్రంగా వారిని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
విజయవాడ కేంద్రంగా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం మద్యం మాఫియా, భూదందాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ఘటనలపై జోక్యం చేసుకొని ఈడీ, సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.