సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు పెరుగుతున్న విద్యుత్‌ ఛార్జీలు సామాన్యుల నడ్డి విరుస్తుందని అనిపించలేదు కానీ, విమాన టికెట్ల ధరలు ఆయనకు ఆవేదన కలిగిస్తున్నాయి.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు పెరుగుతున్న విద్యుత్‌ ఛార్జీలు సామాన్యుల నడ్డి విరుస్తుందని అనిపించలేదు కానీ, విమాన టికెట్ల ధరలు ఆయనకు ఆవేదన కలిగిస్తున్నాయి. ఆ ఆవేదనతోనే విమాన టికెట్ల ధరలను నియంత్రించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు(Union Minister Ram Mohan Naidu)కు ఓ లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు పొందుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతూ దోపిడీ చేస్తున్నాయని నారాయణ విమర్శించారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై 6 వేల కోట్ల రూపాయల భారాన్ని వేస్తున్నారు కదా! ఆ విషయంపై నారాయణ ఎందుకు మాట్లాడలేదని వామపక్షాలను ఇంకా అభిమానిస్తున్న కొందరు వేస్తున్న సూటి ప్రశ్న! విమాన టికెట్ల ధరల ప్రభావం పడితే గిడితే ఎగువ మధ్య తరగతి వారిపైనే పడుతుంది తప్ప సామాన్యులకు వాటితో పెద్దగా సంబంధం లేదు. ఎందుకంటే వారు విమాన ప్రయాణాలు చేయరు. కానీ పెరుగుతున్న కరెంట్ చార్జీలు(Current Charges) అలా కాదు. దిగువ మధ్య తరగతి, పేద ప్రజలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌ చూపుతాయి. ఇంత పెద్ద అంశాన్ని వదిలేసి నారాయణ విమాన టికెట్లపై ఎందుకు కలత చెందుతున్నట్టు? జవాబు నారాయణ చెబితే బాగుంటుంది.

ehatv

ehatv

Next Story