ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(CM Chandrababu) సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె. రామకృష్ణ(CPI Ramakrishna) లేఖ(Letter) రాశారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(CM Chandrababu) సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె. రామకృష్ణ(CPI Ramakrishna) లేఖ(Letter) రాశారు. విద్యారంగంపై(Education) దృష్టి సారించమని సూచన చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, యూనివర్సిటీలకు ఉపకులపతులను తక్షణమే నియమించాలని లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారని, అయితే ఆ పోస్టులను భర్తీ చేయడలో గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ప్రభుత్వం విఫలమయ్యిందని రామకృష్ణ ఆరోపించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ వెంటనే పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబుకు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story