టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టు ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయ్యి గ‌త నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు కోర్టు ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు(Skill Development Case)లో అరెస్ట్ అయ్యి గ‌త నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు. అయితే.. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబుకు గదిలో ఏసీ(AC) ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లో చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జైలులో చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఎండల కారణంగా డీహైడ్రేషన్‌(Dehydration)కు గురవ్వడంతో పాటు స్కీన్ ఎలర్జీ(Skin Alergy) వంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు తరుఫు లాయర్లు ఏసీబీ కోర్టు(ACB Court)లో హౌస్ మోషన్ పిటిషన్(House Motion Petition) దాఖలు చేశారు. చంద్రబాబు ఎండల వేడీ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారని.. ఆయన గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. జైల్లో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

Updated On 14 Oct 2023 7:47 PM GMT
Yagnik

Yagnik

Next Story