వైయస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని సిబిఐ.. కోర్టుకు తెలిపిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. వివేక హత్య కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిబిఐ కోర్టుకు తెలిపినట్టు సమాచారం.

వైయస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని సిబిఐ.. కోర్టుకు తెలిపిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. వివేక హత్య కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిబిఐ కోర్టుకు తెలిపినట్టు సమాచారం. ఈ నేపద్యంలోనే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. సిబిఐ వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఐదో తేదీ లోపు సిబిఐ కి లొంగి పోవాలని గంగిరెడ్డి కి సూచించినట్టు తెలుస్తుంది. లొంగిపోని పక్షంలో సిబిఐ గంగిరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

Updated On 27 April 2023 3:20 AM GMT
Ehatv

Ehatv

Next Story