కడపలో జగన్‌ ప్రభుత్వం, విజయాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'జగన్‌కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా' అంటూ ఓ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు.

కడపలో జగన్‌ ప్రభుత్వం, విజయాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'జగన్‌కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా' అంటూ ఓ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. 'వొన్నో ఈ పార్టీకి నాకు ఏం సంబంధం లా.. ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చేప్తా ఉండ అంతే' అని ఫ్లెక్సీ చివర రాశారు. 2018-19లో టీడీపీ హయాంతో పోలుస్తూ వైసీపీ ప‌రిపాల‌న‌లో పెరిగిన సంప‌దను లెక్క‌ల‌తో స‌హా ఆ ఫ్లెక్సీలో వివ‌రించారు. రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి స‌మాధానాల‌ను ఫ్లెక్సీ రూపంలో రాయలసీమ యాస‌లో ఏర్పాటు చేశారు. రాజ్యసభ సాక్షిగా గత ఐదేళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్నా.. కరోనా లాంటి ప్రతి కూల పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నిట్లో కలుపుకొని 2018-19కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్క సృష్టించి ఉండ్లా జగన్‌ అంటూ ఫ్లెక్సీలో ఉంది. 2018-19కి రాష్ట్ర GSDP – 7.9 లక్షల కోట్లుగా వుంటే, 2023-24 కి రాష్ట్ర GSDP 12.91 లక్షల కోట్లుకి చేర్చి పెట్టుండ్లా మన జగన్‌. GSDP అంటే ఎందో అనుకుంటండారా మీరు.. ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర. అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లున్నా..

వ్యవసాయం, ఫారెస్ట్రీ-ఫిషింగ్ రంగాల్లో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ.2,61,448 కోట్లు ఉండగా.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ. 4,31,100 కోట్లకు పెరిగింది. ఈ రంగాల్లో వార్షిక వృద్ధి రేటు 12.97% న‌మోదైంది.

మైనింగ్, క్వారీ రంగంలో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ. 20,955 కోట్లు ఉండగా.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ.32,259 కోట్లకు పెరిగింది.

వార్షిక వృద్ధి రేటు: 10.78% న‌మోదైంది.

ఉత్ప‌త్తుల్లో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ.67,393 కోట్లు ఉండగా.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ.1,29,806 కోట్లుకు ఎగ‌బాకింది.

వార్షిక వృద్ధి రేటు: 18.52%గా న‌మోదైంది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల్లో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ.13,297 కోట్లు ఉంటే.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ.24,766 కోట్లకు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు: 17.25% న‌మోదైంది.

నిర్మాణ రంగంలో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ.56,106 కోట్లు ఉండగా.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ.95,749 కోట్లకు పెరిగింది.

వార్షిక వృద్ధి రేటు: 14.13% న‌మోదైంది.

వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్ల రంగంలో 2018-19 (టీడీపీ ప్రభుత్వం)లో రూ.58,142 కోట్లు ఉంటే.. 2023-24 (వైసీపీ ప్రభుత్వం)లో రూ.89,716 కోట్లకు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు: 10.86% న‌మోదైంది.

ఈ వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాకుండా దానిపై చర్చించుకుంటున్నారు.

Updated On 18 Dec 2024 8:04 AM GMT
ehatv

ehatv

Next Story