జగన్‌(YS Jagan), షర్మిల(YS Sharmila) ఆస్తుల పంపకాలపై(Assests distribution) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌(congress) సీనియర్‌ నేత తులసిరెడ్డి(Tulasi reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌(YS Jagan), షర్మిల(YS Sharmila) ఆస్తుల పంపకాలపై(Assests distribution) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వ్యవహారం ఎప్పటికైనా మాట్లాడుకొని ఆస్తులు పంచుకోవాల్సిందే కదా అని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ తెచ్చిన చట్టం ప్రకారం ఆస్తిలో ఆడపిల్లలకు సమానవాటా దక్కుతుందన్నారు. పులివెందుల, హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తులను పంచుకున్నట్లు వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌(Lotus Pond) ఇల్లును జగన్‌ తన చెల్లికి ఇచ్చినట్లు తెలిసిందని తులసిరెడ్డి చెప్పారు. ఈ మధ్య కాలంలో జగన్‌ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు గమనిస్తున్నామని తులసిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలపై ఢిల్లీలో ధర్నా చేసిన జగన్‌కు ఇండియా కూటమి నేతలు మద్దతిచ్చారని.. తన ప్రత్యర్థులు ఎన్డీఏ కూటమిలో ఉన్నారని.. దీంతో జగన్‌ కూడా ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని తులసిరెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో హర్యానా ఎన్నికలపై జగన్‌ స్పందించిన తీరు కూడా అలాగే ఉందని.. ఈవీఎంలు లేకుంటే హర్యానాలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలే ఉన్నాయని జగన్‌ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనమని తులసిరెడ్డి అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story