Gaddam vamsi krishna : పెద్దపల్లిలో లొల్లి ముదురుతోంది..!
పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ(Gaddam vamsi krishna) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! కాంగ్రెస్ అధినాయకత్వం వంశీకృష్ణకు టికెట్ ఖరారు చేసింది. ఆ మరుక్షణం నుంచే కాంగ్రెస్‌లో(Congress) అసమ్మతి మొదలయ్యింది. పార్టీ క్యాడర్ బహిరంగ విమర్శలకు దిగుతోంది. అధిష్టానానికి విన్నపాలు చేసుకుంటోంది. వివేక్ కుటుంబంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఒక కుటుంబంలోంచి ఇంత మందికి, ఇన్ని అవకాశాలు ఇస్తారా? అని నిలదీస్తున్నారు.
పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ(Gaddam vamsi krishna) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! కాంగ్రెస్ అధినాయకత్వం వంశీకృష్ణకు టికెట్ ఖరారు చేసింది. ఆ మరుక్షణం నుంచే కాంగ్రెస్‌లో(Congress) అసమ్మతి మొదలయ్యింది. పార్టీ క్యాడర్ బహిరంగ విమర్శలకు దిగుతోంది. అధిష్టానానికి విన్నపాలు చేసుకుంటోంది. వివేక్ కుటుంబంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఒక కుటుంబంలోంచి ఇంత మందికి, ఇన్ని అవకాశాలు ఇస్తారా? అని నిలదీస్తున్నారు. పార్టీలో గడ్డం ఫ్యామిలీ కాకుండా ఇంకెవరూ దళితులు లేరా? ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల మాటేమిటి? వారేం కావాలి? అని ఆగ్రహిస్తున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కష్టపడుతున్నవారిని పక్కన పెట్టి, నాలుగు నెలల కిందట పార్టీలోకి వచ్చిన గడ్డం కుటుంబానికి అన్ని అవకాశాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి వంశీ కృష్ణను మార్చాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొందరు నేతలు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు కల్నల్ రోహిత్ చౌదరిని కలిసి పెద్దపల్లి పరిస్థితులను వివరించారు. అభ్యర్థిని మార్చకపోతే కష్టమేనని చెప్పారు. వివేక్ రాజీనామా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసి తన కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారని సుల్తానాబాద్‌కు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన న్యాయపోరాట దీక్ష చేపడుతున్నానని చెప్పారు. వివేక్ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఆయన కొడుకుకు ఇప్పుడు లోక్‌సభ టికెట్ ఇచ్చారని, ఇలా ఒకే కుటంబానికి మూడు అవకాశాలు ఇచ్చారని, ఇలా అయితే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని, ఇదెక్కడి న్యాయమని వరప్రసాద్ అంటున్నారు. రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వ్యక్తికి, అది కూడా కేవలం మూడు నెలల కిందట పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు వరప్రసాద్.