ప్రత్యేక తెలంగాణ కోసం తపించిపోయిన నేతలలో విజయశాంతి కూడా ఒకరు.

ప్రత్యేక తెలంగాణ కోసం తపించిపోయిన నేతలలో విజయశాంతి కూడా ఒకరు. ఆమె తెలంగాణ కోసం ఎంతగానో పాటుపడ్డారన్నది కాదనలేని సత్యం. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో(TRS) ఉన్న విజయశాంతి(Vijayshanthi) తర్వాత బీజేపీలోకి(BJP), తర్వాత కాంగ్రెస్‌లోకి(congress) వెళ్లారు. బీఆర్ఎస్‌ పట్ల ఆమె ఇప్పటికీ సానుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. సంక్షోభంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఆమె కొన్ని సూచనలు చేశారు. పార్టీ వదిలేసి వెళుతున్న ఎమ్మెల్యేలను ఆపుకోవడానికి పోరాటం చేయాలని, అప్పుడే బీఆర్‌ఎస్‌ మనుగడ సాగించగలదని విజయశాంతి ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా సూచనలు చేశారు.

' పార్టీ వదిలి వెల్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనీకి కొట్లాడితే బీఆర్ఎస్ బతకజాలదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభం అయ్యిందో గుర్తు తెచ్చుకుని ఆ చరిత వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు..అయితే పదవులల్ల కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కలు ఇయ్యాల ఏవో పరిస్థితులు చూపి బయటకు పోతున్నది వాస్తవం. ఏది ఏమైనా... బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయి అన్న ధోరణి లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి, ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతని ఆచరణాత్మకంగా వ్వవహరించని స్థితి తెలంగాణ ల ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా...తమ సమస్యలపై నియతితో ప్రయత్నిస్తే ప్రజలు ఎన్నడైనా తప్పక విశ్వసిస్తరు... అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం, ప్రామాణికం అన్న జన బాహుళ్య అభిప్రాయం బీఆర్ఎస్ కు కూడా తెలియజేస్తూ...

జై తెలంగాణ

హర హర మహాదేవ్ '

అంటూ విజయశాంతి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story