చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) వెనుక మోదీ(Modi), కేసీఆర్(KCR) లు ఉన్నారని కాంగ్రెస్(Congress) నేత మధు యాష్కీ(Madhu Yashki) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీని వెనుక కేసీఆర్ పాత్రపై మాకు పూర్తి స్థాయి సమాచారం ఉందని అన్నారు. చంద్రబాబు గతంలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను కక్ష సాధింపు చర్యలకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. బాబుకు బెయిల్(Bail) రాకుండా మోదీ, కేసీఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు.

చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) వెనుక మోదీ(Modi), కేసీఆర్(KCR) లు ఉన్నారని కాంగ్రెస్(Congress) నేత మధు యాష్కీ(Madhu Yashki) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీని వెనుక కేసీఆర్ పాత్రపై మాకు పూర్తి స్థాయి సమాచారం ఉందని అన్నారు. చంద్రబాబు గతంలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను కక్ష సాధింపు చర్యలకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. బాబుకు బెయిల్(Bail) రాకుండా మోదీ, కేసీఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు. బాబు అక్రమ అరెస్ట్ పై జగన్ సర్కార్ కుట్ర వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారని అన్నారు.

బాబు అరెస్ట్ పై కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. ఆంధ్రా సెటిలర్స్ ఓట్ల కోసం ఎల్బీనగర్ ఎమ్మెల్యే మేకతోలు కప్పుకున్న పులిలా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచింది చంద్రబాబు, కాంగ్రెస్ దయతోనే అని అన్నారు.

ఆప్‌ ఉప ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబును మ‌రో కేసులో అరెస్ట్ చేసి జైల్ లో పెట్టారు. మరి లిక్కర్ స్కామ్ లో కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్ర‌శ్నించారు. మోదీ, కేసీఆర్, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని అన్నారు.

Updated On 19 Sep 2023 4:09 AM GMT
Ehatv

Ehatv

Next Story