తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు(BR Naidu) శ్రీవాణి ట్రస్ట్‌పై(Srivani Trust) కోపం పెంచుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు(BR Naidu) శ్రీవాణి ట్రస్ట్‌పై(Srivani Trust) కోపం పెంచుకున్నారు. ఆయన ఛైర్మన్‌గా నియామకం కాకమునుపే శ్రీవాణి ట్రస్ట్‌ రద్దు చేస్తానంటూ ప్రకటించారు. టీటీడీ అన్నదే ఓ ట్రస్ట్ అని, మరో ట్రస్ట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. పైగా శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వచ్చే డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానం భక్తులతో ఉందని నాయుడు చెప్పుకొచ్చారు. ఆడిటింగ్‌ జరుగుతున్నదని, అందులో అన్ని లెక్కలు తేలతాయని అన్నారు. నిజానికి తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా మొదటి నుంచి శ్రీవాణి ట్రస్ట్‌పై వ్యతిరేక వార్తలు రాస్తూ వచ్చింది. కారణంగా జగన్మోహన్‌ రెడ్డి(YS Jagan) సర్కారులో ఏర్పాటయ్యింది కాబట్టి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా నూతన ఆలయాల నిర్మాణాన్ని టీటీడీ చేపట్టిన విషయం నాయుడుకు తెలియదు కాబోలు! గమనించదగ్గ మరో విషయమేమిటంటే బీఆర్‌ నాయుడు రద్దు చేయాలనుకుంటున్న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో కేటాయించడం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక గోకులం సమావేశ మందిరం వెనుకవైపు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Choudhary) ప్రారంభించారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్‌ ద్వారా కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో టికెట్‌ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం నిమిషంలో భక్తులకు టికెట్‌ ఇచ్చేలా అప్లికేషన్‌లో మార్పులు చేశామని తెలిపారు. అయిదు కౌంటర్లలో భక్తులు సులభంగా టికెట్లు కొనుక్కోవచ్చని వెంకయ్య చౌదరి తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే టీటీడీలో గందరగోళం నెలకొన్నదని అర్థమవుతున్నది.

Eha Tv

Eha Tv

Next Story