Comparison Between CM Jagan and Chandrababu in AP politics : విశ్వసనీయత ఎవరికెంత?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP Politics) ఇప్పుడు విశ్వసనీయత అనే పదం చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మహన్‌రెడ్డి(YS Jagan) విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో(YCP Manifesto) పెద్దగా హామీలేమీ ఇవ్వలేదు కానీ తాను ఇప్పటి వరకు అమలు చేసిన హామీలకు అదనంగా కొన్ని చేర్చి మేనిఫెస్టోను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP Politics) ఇప్పుడు విశ్వసనీయత అనే పదం చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మహన్‌రెడ్డి(YS Jagan) విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో(YCP Manifesto) పెద్దగా హామీలేమీ ఇవ్వలేదు కానీ తాను ఇప్పటి వరకు అమలు చేసిన హామీలకు అదనంగా కొన్ని చేర్చి మేనిఫెస్టోను ప్రకటించారు. నవరత్నాలు ప్లస్ పేరుతో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. గత అయిదేళ్లుగా ఈ పథకాలను ఎందుకు అమలు చేయాల్సి వచ్చింది? రాబోయే కాలంలో అమలు చేయాల్సిన అవసరమేమిటో జగన్ వివరంగా, ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఇదే సమయంలో ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించారు. తాను అమలు చేయలేని పథకాలకు మరెవ్వరూ అమలు చేయలేదరని కొండంత ఆత్మవిశ్వాసంతో జగన్ చెప్పుకొచ్చారు. ఏపీలో సంపద సృష్టి తన హయాంలోనే జరిగిందని, చంద్రబాబు పాలనలో కాదని జగన్ కుండబద్దలు కొట్టారు. ఇందుకు రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన గణాంకాలను సాక్ష్యంగా చూపించారు. ఇవన్నీ కాకుండా జగన్ ప్రధానంగా విశ్వసనీయతపైనే జగన్ ఎన్నికలకు వెళుతున్నారు. ఆయన ఎన్నికల ఎజెండానే విశ్వసనీయత! మరి తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి ఏమిటి? ఆయనకు విశ్వసనీయత లేదనుకోవాలా? అంటే మాత్రం చంద్రబాబులో విశ్వసనీయత కించుత్తు కూడా ఉండదని చెప్పాలి. మేనిఫెస్టో విషయానికే వస్తే 2014లో జగన్ ఓ మేనిఫెస్టో ఇచ్చారు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఓ మేనిఫెస్టో(TDP, Janasena, BJP Manifesto)ను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఆ రోజున ఉన్న పరిస్థితులలో కూటమి ఇచ్చిన హామీలు నమ్మారు. మేనిఫెస్టోను నమ్మి జనం టీడీపీకి ఓటు వేశారు. మరి అయిదేళ్ల కాలంలో మేనిఫెస్టోలోని ఎన్ని అంశాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది? ఈ విషయంలో టీడీపీ విఫలం చెందింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయామని చెబుతుంటారు. రైతు రుణమాఫీ విషయం కావొచ్చు, డ్వాక్రా రుణాల మాఫీ విషయం కావొచ్చు, ప్రత్యేకహోదా అంశం కావొచ్చు, నిరుద్యోగ భృతి కావొచ్చు, ఉద్యోగ కల్పన కావొచ్చు.. ఇంకా అనేక హామీలను టీడీపీ(TDP) ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. కేవలం ఓట్ల కోసమే కూటమి ఆ వాగ్దానాలు చేసిందని ప్రజలు లేటుగా అర్థమయ్యింది. ప్రత్యేకహోదా విషయంలో అయితే చంద్రబాబు మూడు నాలుగుసార్లు మాట మార్చారు. ప్రత్యేక హోదా ఏం సంజీవిని కాదన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ప్రత్యేక నిధులు చాలని చెప్పారు. ఎన్నికలు దగ్గరకొచ్చిన సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాటానికి దిగారు. కేంద్రప్రభుత్వాన్ని పచ్చి బూతులు తిట్టారు. ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా తిట్టారు. మరోవైపు జగన్ 2019 ఎన్నికలప్పుడు ఏం వాగ్దానాలు చేశారు? వాటిని ఎలా నెరవేర్చారో మనకు తెలిసిందే! అయిదేళ్లుగా తాను ఏంచేశారో చూసి ఓటు వేయండి అని జగన్ చెబుతూ వస్తున్నారు. అది జగన్ కాన్ఫిడెన్స్.. మరోవైపు చంద్రబాబుకు మాత్రం ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలో అర్థం కావడం లేదు. అందుకే జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మొత్తంగా విశ్వసనీయ విషయంలో ఎక్కువ మార్కులు జగన్‌కే పడతాయి..!