మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో దాదాపు 99 శాతం నెరవేర్చామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి చేశామని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పని చేస్తున్నామని చెప్పిన జగన్ తమ ప్రభుత్వంలో లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనం కలుగుతున్నదని వివరించారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో దాదాపు 99 శాతం నెరవేర్చామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి చేశామని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పని చేస్తున్నామని చెప్పిన జగన్ తమ ప్రభుత్వంలో లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనం కలుగుతున్నదని వివరించారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చమన్నారు. డీబీటీ ద్వారా ఇప్పటి వరకు 1,97,473 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామని ఏపీ సీఎం తెలిపారు. జిల్లాల సంఖ్య పెంచడంతో ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయని, 15004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని, వాటిల్లో లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రెవెన్యూ డివిజన్‌లను 51 నుంచి 76కు పెంచామన్నారు. దేశంలోనే తొలిసారిగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశామని, ఇంత మంది అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్లు అన్నదాతలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత విద్యుత్‌, ధాన్యం సేకరణ చేశామని చెప్పారు. కబ్జాలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని జగన్ తెలిపారు.

ఏ ఊరికి వెళ్లినా మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని, సుమారు నాలుగేళ్ల పాలనలో జగన్ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం అందించిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలేనని, వైసీపీ ప్రభుత్వం 65 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నదని, 2,700 రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెన్షన్‌ పెంచుతామని, పెన్షన్‌ మూడు వేలు చేశాకే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ తరహాలో పెన్షన్‌ అందిస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచామని, రాష్ట్రంలో ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. పారిశ్రామిక రంగంలో తిరుగులేని మార్పునకు శ్రీకారం చుట్టామన్నారు.

ఎన్నికల హామీలను మర్చిపోవడం గత ప్రభుత్వానికి అలవాటన్న జగన్‌ తాము మాత్రం ఇచ్చిన హామీలలో దాదాపు అన్నింటిని నెరవేర్చామన్నారు. కోటి 17 లక్షల మంది దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, దిశా యాప్‌తో పాటు దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని జగన్‌ పేర్కొన్నారు. దిశా చట్టం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. వచ్చే రెండేళ్లలో ఆరు తరగతి నుంచి డిజిటల్‌ క్లాసులు ఉంటాయని తెలిపిన ముఖ్యమంత్రి కార్పొరేట్‌ స్కూల్స్‌ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్థితి వచ్చిందని సగర్వంగా చెప్పారు. 8వ తరగతి నుంచే ట్యాబ్‌ను అందిస్తున్నాన్నారు జగన్‌. మత్స్యకారులకు 4 వేల 200 కోట్లు అందించామని, వీధి వ్యాపారులకు వాహనమిత్ర, జగనన్న తోడు వంటి పథకాలతో అండగా నిలిచామని చెప్పారు. తన నడక నేలపైనేనని, తన యుద్ధం పెత్తందారులతోనని, తన లక్ష్యం పేదరిక నిర్మూలన అని అందుకే నా ఎకనామిక్స్‌ వేరేనని ముఖ్యమంత్రి జగన్‌ సభలో పేర్కొన్నారు.

Updated On 15 March 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story