శ‌నివారం ఉద‌యం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పోలీస్‌ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఆయ‌న.. అనంత‌రం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణం ఒదిలిన పోలీసు సోదరుల కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని తెలిపారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం […]

శ‌నివారం ఉద‌యం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పోలీస్‌ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఆయ‌న.. అనంత‌రం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణం ఒదిలిన పోలీసు సోదరుల కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని తెలిపారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం విసురుతూ ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలన్నారు.

ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజాజీవనాన్ని తమ స్వార్ధం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులేన‌న్నారు. ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలనుకునే ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో, అజ్ఞాతంలో కాకుండా ప్రజా జీవితంలో ఉంటూ.. అదే ప్రజాజీవితం మీద దాడిచేయడాన్ని కూడా మనమంతా ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైన పరిస్థితులను చూస్తున్నాం. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పత్రికాస్వేచ్ఛ లాంటి పదాలకు అర్ధం అంటే.. ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని పోలీసుల నుంచి న్యాయస్ధానాల నుంచి లాగేసుకోవచ్చు అని కాదు. మొన్ననే మనమంతా చూశాం. నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చంపారు. మన కళ్లెదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ.

అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీవాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడం, ఆ తర్వాత పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలవ‌డం.. ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి.. అవినీతి, నేరాలు చేస్తే.. ఆ పైన ఆధారాలు అన్ని చూసిన పిమ్మట న్యాయస్ధానాలన్నీ వీరికి అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద కూడా ట్రోలింగ్‌ చేస్తారు. వారికి సంబంధించిన టీవీ ఛానెళ్లలో డిబెట్లు నడుపుతారు. తమను ఎవరూ కూడా ఏం చేయలేరన్న అహంకారంలో ఇవన్నీ చేస్తుంటారు. ఇటువంటివి అన్నీ యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ చేసే పనులే తప్ప.. ప్రజాస్వామ్యం మీద కానీ, రూల్‌ ఆఫ్‌ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావ‌ని అన్నారు.

తమ స్వార్ధం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్‌రెస్ట్‌ క్రియటే చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పని పెట్టండని, ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుందన్నది కూడా మనమంతా ఆలోచన చేయాల్సిన విషయం అని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు విషయంలోనూ, మరీ ముఖ్యంగా పిల్లలు, అణగారిన సామాజికవర్గాల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని స్పష్టం చేశారు.

Updated On 21 Oct 2023 3:56 AM GMT
bodapati ashok

bodapati ashok

Next Story