రైతులకు ఆప్కాబ్‌ వెన్నుదన్నుగా నిలిచింది. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయి. డిజిటిలైజేషన్‌తో సేవలు మరింత వేగం అందుకున్నాయి. రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆప్కాబ్‌లో వైఎస్సార్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్కాబ్‌ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయి.

ఆప్కాబ్‌ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు కీలక పాత్ర

ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉంది

ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైంది

సహకార వ్యవస్థను వైఎస్సార్‌​ బలోపేతం చేశారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) శుక్రవారం విజయవాడలో(Vijayawada) పర్యటించారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(APCOB) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు. ఆప్కాబ్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్‌ కృషి చేస్తోంది. ఆప్కాబ్‌ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిది. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైంది. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్సార్‌. సహకార వ్యవస్థను వైఎస్సార్‌​ బలోపేతం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతులకు ఆప్కాబ్‌ వెన్నుదన్నుగా నిలిచింది. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయి. డిజిటిలైజేషన్‌తో సేవలు మరింత వేగం అందుకున్నాయి. రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆప్కాబ్‌లో వైఎస్సార్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్కాబ్‌ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయి. ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్‌బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయి. ఆర్‌బీకేలను ఆప్కాబ్‌తో అనుసంధానం చేశాం. దేశ చర్రితలోనే మన ఆప్కాబ్‌కు మంచి గుర్తింపు ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కాగా 1963లో ప్రారంభమైన ఆప్కాబ్‌ చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తోంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది. 2019 నాటికి కేవలం రూ.13,322 కోట్ల టర్నోవర్‌కే పరిమితమైంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో 4 ఏళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. ఈ నాలుగేళ్లలో రెండు సార్లు జాతీయ అవార్డులను ఆప్కాబ్ సాధించింది.

Updated On 4 Aug 2023 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story