ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. 'విజన్ విశాఖ సదస్సు'లో ఆయన వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. వైజాగ్ పెట్టుబడులకు ఎందుకు అనుకూలమో.. ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు ఎలాంటి రాయితీలను ఇవ్వనుందో వివరించనున్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కంపెనీలను పెట్టడానికి కేవలం ఒక కాల్ దూరంలో ఉందని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అందుకే పలు సంస్థలు కూడా కంపెనీలు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేటి షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అవ్వనున్నారు. ఆ తర్వాత పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తాడేపల్లి చేరుకుంటారు.