శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ నేడు భూమి పూజ చేయనున్నారు. అంతేకాక‌ ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు, రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా నేడు సీఎం శంకుస్ధాపన చేయ‌నున్నారు

శ్రీకాకుళం(srikakulam) జిల్లా సంతబోమ్మాళి(Santhabommali) మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) నేడు భూమి పూజ చేయనున్నారు. అంతేకాక‌ ఎచ్చెర్ల(Etcherla) మండలం బుడగట్లపాలెం(Budagatlapalem) తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు, రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌(Vamsadhara lift irrigation)కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా నేడు సీఎం శంకుస్ధాపన చేయ‌నున్నారు.

30 నెలల్లో పూర్తికానున్న పోర్టు పనులు పూర్తికానున్నాయి. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 4 బెర్తుల నిర్మాణం, జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించ‌నున్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)తో పాటు ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్(Madhya Pradesh), దక్షిణ ఒడిశా(South Odisha) రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు మూలపేట పోర్టు అత్యంత కీలకంగా మారనుంది.

సుమారు రూ. 16.000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం(Ramayapatnam), మచిలీపట్నం(Machilipatnam), కాకినాడ సెజ్(Kakinada), మూలపేట(Mulapet) పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులకు అవ‌కాశం ఉంటుందని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.

కార్య‌క్ర‌మంలో భాగంగా విష్ణుచక్రం(Vishnuchakram), మూలపేట(Mulapeta) గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి రూ. 109 కోట్లు కేటాయించ‌నున్నారు. నౌపడ(Naupada)లో 55 ఎకరాల్లో అధునాతన వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. మూలపేట పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి ల‌భించ‌నుంది.

Updated On 18 April 2023 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story